లగచర్ల నిందితుడు సురేశ్​పై లుకౌట్  సర్క్యులర్

హైదరాబాద్, వెలుగు: లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు బోగమోని సురేశ్  పాస్ పోర్టును పోలీసులు సీజ్  చేశారు. దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్  సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న సురేశ్  కోసం నాలుగు స్పెషల్ టీమ్స్ తో గాలిస్తున్నారు. నిందితుడి మొబైల్  నంబర్  కాల్ డేటా ఆధారంగా లాస్ట్ కాల్, ఘటన జరిగిన రోజు మాట్లాడిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే సురేశ్ ను తప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఎవరికి అనుమానం రాని చోట దాచినట్లు భావిస్తున్నారు. షెల్టర్  ఇచ్చిన వారిని గుర్తించి వారిపైనా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రముఖుల పక్కా ప్రణాళిక ప్రకారమే సురేశ్ ను అజ్ఞాతంలోకి పంపించినట్లు గుర్తించారు. ఎవరికీ తెలియని ఫోన్ నంబర్ తో కొంత మందికి సురేశ్  టచ్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారు సూచనల మేరకే స్థావరాలు మారుస్తున్నాడని గుర్తించారు.